Dandalayya Song
పల్లవి : జై జై జై గణేశా జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
జై జై జై జై గణేశా జై జై జై జై
జై జై జై జై వినాయక జై జై జై జై
దండాలయ్యా ఉండ్రాలయ్య.. దయుంచయ్య దేవా.. నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా తోవా…. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా.. తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించవయ్యా…
దండాలయ్యా ఉండ్రాలయ్య.. దయుంచయ్య దేవా.. నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా తోవా…. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా.. తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించవయ్యా..
ఓ . ఓ.. ఓహో…
చ1 : చిన్నారి ఈ చిట్టెలుకల భరించరా లంబోదర.. పాపం కొండంత నీ పెను భారం.. ముచ్చమటలు కక్కింది రా బొజ్జగములు తిప్పింది రా.. ఓహో ఓహో జన్మ ధన్యం
అంబారిగా ఉండగల ఇంతటి వరం… అంబాసుత ఎందరికి లభించురా.. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా……….
దండాలయ్యా ఉండ్రాలయ్య.. దయుంచయ్య దేవా.. నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా తోవా…. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా.. తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించవయ్యా…
చ 2: శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం…. నిన్నే చేసింది వేళాకోళం ఎక్కువ ఎక్కిన మదం దిగిందిగా.. తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది నీ గర్వం…
త్రిమూర్తులే నినుగని తలొంచరా.. నిరంతరం మహిమను కీర్తించరా… నువ్వెంత అనే అహం నువ్వే దండించర….
దండాలయ్యా ఉండ్రాలయ్య.. దయుంచయ్య దేవా.. నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా తోవా…. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా.. తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించవయ్యా…..