ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డు క్రియేట్ చేసింది. అయితే రీసెంట్గా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. అదేమిటంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు సినిమా పరంగా 24 రోజుల కలెక్షన్ల వివరాలు చూసినట్లయితే..
వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన కల్కి సినిమా నిర్మించిన అశ్విని దత్ మూవీ కొత్త రికార్డును సృష్టించింది. బుక్ మై షో లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డుల క్రియేట్ చేసింది. అలాగే మహేష్ బాబు సొంత థియేటర్ ఏ ఎం బి లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అది నిజమైతే ఇది చాలా పెద్ద రికార్డుగా నమోదు చేసింది.
కల్కి మొదటి వారంలో తెలుగులో 215 కోట్ల రూపాయలు తమిళంలో 20 కోట్ల రూపాయలు హిందీలో 160 కోట్ల రూపాయలు కన్నడలో 30 కోట్ల రూపాయలు మలయాళంలో 15 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా చిత్రవర్గాలు చెప్తున్నాయి దాంతో ఈ చిత్రానికి 450 కోట్ల రూపాయలు ఇండియాలో వచ్చినట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 1100 కోట్ల రూపాయలు వచ్చినట్లు చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి