సనాతన ధర్మంపై దాడులు చేసేవారికి హెచ్చరిక
సినిమా అంటే మనకు ఎంత సరదానో చెప్పనక్కరలేదు. సినిమా వాళ్ళ పైన మనకు ఎంతో అభిమానం ఉంటుంది. మరియు సినిమా నటులు ప్రభావం మన మీద చాలా ఉంటుంది. వాళ్ళు మంచి చేస్తే మంచిగా చెడు చేస్తే చెడుగాను సమాజం పై పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే రీసెంట్ గా తిరుమల తిరుపతి
దేవస్థానం లడ్డు విషయంలో కాంట్రవర్సీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం తిరుపతి లడ్డు విషయంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ప్రకాష్ రాజు గారు తిరుపతి లడ్డు నెయ్యి విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా తిరుపతి లడ్డు విషయంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు? అనేదానిపై ఎంక్వయిరీ చేసి దోషుల్ని పట్టుకొని శిక్షించేలా చేయకుండా, దీనిని దేశ సమస్యల ఎందుకు చిత్రీకరిస్తున్నారు అంటూ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కనకదుర్గ ఆలయం సందర్శన సందర్భంగా ఎవరైతే హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారో , తక్కువగా చూస్తున్నారో వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. హీరో కార్తీ గారిని కూడా లడ్డు విషయంలో ఘాటుగా కార్తీ గారిని విమర్శించారు. అదే సందర్భంలో కార్తీక్ గారు వెంటనే ఎక్స్ వేదికగా క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి x వేదిక ద్వారా తెలియచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప కార్తీ గారిని స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇదే సందర్భంలో ప్రకాష్ రాజ్ చేసిన వాక్యలకు స్పందిస్తూ ప్రకాష్ రాజుని తీవ్రంగా విమర్శించారు. హిందువులను ఎవరు అవమానించిన ఎవరు హేళన చేసిన సహించేది లేదు అని పేర్కొన్నారు. ప్రకాష్ రాజు గారిని ప్రత్యక్షంగా ప్రకాష్ గారు మీరు సెక్యులర్ గా ఉండి ఒకే మతం విమర్శించడం మంచిది కాదు. సెక్యులరిజం అంటే వన్వే కాదు ఇది టూ వే కాబట్టి హిందువుల మీద హిందూ దేవుళ్ళ మీద సనాతన ధర్మం మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని పేర్కొన్నారు. మరియు హిందువులపై జరిగే దాడులను హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై జరిగే దాడులను విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రతిసారి మేము రాలేము. కాబట్టి హిందూ ధర్మ రక్షణ బోర్డ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ విమర్శకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఘాటుగా విమర్శించారు.